హంపి యాత్రానుభావాలు
హాయ్ ఫ్రెండ్స్,
మేము మొత్తం నలుగురం, అంటే నేను, మా అన్నయ్య గారు యల్లమందరెడ్డి, మా మిత్రులు వెంకటేశ్వర్లు గారు మరియు మా మేనల్లుడు నాగభూషణరెడ్డి 25th ఆగష్టు 2011 న నైట్ 9'O clock కి నరసరావుపేట లో అమరావతి మెయిల్ నందు బయలు దేరి వెళ్ళాము. ఉదయం 7 కి హోస్పేటలో దిగాము. రైల్వేస్టేషన్ నుండి బస్టాండ్ సెంటరుకు ఆటోలో వెళ్ళాము. అక్కడ సర్వీసు ఆటోస్ కుడా ఉన్నాయి, సెంటర్ కి Rs.7/- తీసుకుంటున్నారు. మేము సేపరాటే ఆటోలో వెళ్ళాము కనుక Rs. 40/- teesukunnaaru. సుమారు దూరం 2kms వుంటుంది. ఆటో సెంటరులో దిగగానే అంతకు పూర్వం మేము వచ్చినపుడు దిగిన 'హోటల్ పుష్పక్' (ఇది జస్ట్ బస్టాండ్ కు పక్కనే ఉంటుంది) లో దిగాము. రూమ్స్ మరీ క్లాస్ కాదు కాని పరవాలేదు బాగున్నాయి. డబల్ రూం కు రోజుకు Rs.250/- మాత్రమే రెంట్, హాట్ వాటర్ కుడా ఇస్తున్నారు. అలాంటి టూరిస్ట్ ప్లేసెస్ లో అంత తక్కువకు రూం అంటే కొంచం వింతగానే ఉంది, కాని దొరుకున్నాయి మరి. వేరే హోటల్స్ లో అడిగితే Rs.450/- to Rs. 500/- మినిమం ఉంది. ఇంతకు పూర్వం వెళ్ళాము కనుక తెలిసిన వాళ్ళం కాబట్టి మేము ఆ హోటల్ లో దిగాము. స్నానం చేసి నిత్యాగ్నిగాయత్రీ హోమం చేసుకొని, 9 గంటలకు పక్కనే ఉన్న హోటల్లో సింగిల్ ఇడ్లీ, ఖాలీ దోశ తినిని కార్ మాటలడుకొని హంపి దర్శనానికి బయలు దేరాము. మొదటగా 'విరూపాక్ష' టెంపుల్ చూసాము. స్వామి దర్శనానంతరం అక్కడ ఉన్న వింత (గాలిగోపురం ఛాయ తలక్రిందులుగా పాడటము) చూసి టెంపుల్ బ్యాక్సైడ్ నే ఉన్న 'విద్యారణ్యస్వామి' వారి పీటం(ఆశ్రమం) దర్షించాము. మా అద్రుష్టం మేము వెళ్ళిన సమయానికి పీటాదిపతి గారు పూజ చేస్తున్నారు, పూజ అయ్యాక వారి ఆశీస్సులు అందుకొని బయటకు వచ్చాము.
హంపిలోని సైట్ seeing బయలు దేరాము. ముందుగా బడా గణేష్ ని దర్శించుకున్నాము, తరువాత కమలాపూర్ రోడ్ లో ఉన్న నరసింహస్వామి, మహాలింగేశ్వర దర్శనం చేసుకున్నాము. అనంతరం వీరభద్రస్వామిని దర్శించుకొని, లోటస్ మహల్, గజశాల, మహానవమి దిబ్బ, గొప్పదైన కోనేరు, గుడచారులతో రహస్య మంతనాల భూగృహం, మహారాణి బాతింగ్ మహల్ చూసుకొని కమలాపూర్ చేరి, అక్కడ నుండి విట్టాల్ టెంపుల్ కి వెళ్ళాము. అక్కడ ఈ మధ్యనే బాటరీ కార్స్ ప్రవేశ పెట్టారు, మన వెహికల్స్ ను 1km దూరంలో ఆపించి, మనం టూరిసం వారి బాటరీ కార్ లో వెళ్ళాలి, up and down Rs.20/- తీసుకున్నారు. అక్కడ ప్రత్యేకత లేడీ డ్రైవర్స్. విట్టాల్ టెంపుల్ ఒక అద్భుతం, అక్కడ సంగీతం విన్పించే స్తంభాలు ఉన్నాయి. ఏకశిల రధం ఉంది. amazing శిల్ప కల నైపుణ్యం అక్కడ ప్రత్యేకత. అక్కేనేనిగారి ''శిలలపై శిల్పాలు చెక్కినారు'' సాంగ్ అక్కడే షూట్ చేసారట. అంతే కాక అక్కడ విచిత్ర శిల్పకళా నైపుణ్యం చాలా ఉంది, అవి అన్ని చుసిన తరువాత నెక్స్ట్ ప్రోగ్రాం కి బయలు దేరాము.
మా నెక్స్ట్ ప్లేస్ టు విజిట్, కిష్కింద (దానిని ప్రెసెంట్ అనగొంది అని పిలుస్తున్నారు) అక్కడకు వెళ్లేందుకు తుంగభద్రా నది అడ్డం ఉంది కనుక మేము వయా గంగావతి వెళ్ళాము. గంగావతిలో భోజనం చేసాము. చాలా బావుంది. 3 పూరీస్, ప్లేట్ రైస్, టు కర్రీస్, చట్నీ, సంబారు, రసం, పెరుగు, మజ్జిగ మరియు లెమన్ చట్నీ ఇట్చారు. మంచి tastegaa ఉన్న్నాయి. రేట్ కుడా చాలా తక్కువే జస్ట్ Rs.35/- అది బుస్స్తాండ్ పక్కనే ఉన్న బృందావన్ హోటల్. భోజనం అయ్యేసరికి దాదాపు 3.30pm అయింది.
మీల్స్ చేసి బయలు దేరి 10kms దూరంలో ఉన్న 'అనగొంది' వెళ్ళాము. అయితే అక్కడ తుంగభద్రా నది ప్రవాహం ఎక్కువగా ఉంది కనుక నవ బృందావన దర్శనం చేసుకోలేక పోయాము. నవ బృదావనం లో రాఘవేంద్ర స్వామి గురువు గారి ఇంకో ఎనిమిది మంది గురువుల సమాధులు ఉన్నాయి. చాలా పవిత్ర మైనదిగా భావిస్తారు. ఇంతకు ముందే నేను చూసాను, కాని నాతో పాటు వచ్చిన వాళ్ళు చూడలేక పోయామే అని బాధ పడ్డారు. అనంతరం కొండ పైన ఉన్న మహాకాళి టెంపుల్ చూసాము. అమ్మవారు మహాశక్తి మంతురాలు అని చెపుతారు. అమ్మ దర్శన అంతరం టెంపుల్ బ్యాక్ సైడ్ వెళితే అక్కడ ఒక కోట ముఖద్వారం ఉంది చాలా గొప్పగా ఉంది. అది దాటి ముందుకు వెళితే శ్రీకృష్ణ దేవరాయల మనుమళ్ళ (grand sons) సమాధులు ఉన్నాయి, అవి చూసి, వాలి, సుగ్రీవ గుహను చూసాము. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. సాధనకు బెస్ట్ ప్లేస్ అని అనిపించింది. అవి చూసుకొని కిందకు వచాము. అప్పటికి టైం నియర్లీ 5.30pm. అక్కడ ఆంజనేయస్వామి బర్త్ ప్లేస్ ఉంది. అయితే అది ఒక పెద్ద కొండ మీద ఉంది. టైం పెర్మిత్ చేయదని మేము వెళ్ళలేక పోయాము. నేను అంతకు ముందు వెళ్లి నప్పుడు చూసాను. నియర్లీ 600 steps ఉన్నాయి ఆ హిల్ ఎక్కేందుకు. కిందనుండి స్వామికి నమస్కరించుకొని దగ్గరే ఉన్న పంపా సరోవరంకి వెళ్ళాము. మొత్తం భారత దేశం లోనే నాలుగు సరోవరాలు ప్రసిద్ది. మొదటిది 'మానస సరోవరం', రెండవది 'నారాయణ సరోవరం', మూడవది పంపా సరోవరం. ఇవి బ్రహ్మ స్వయంగా సృస్తి చేసిన పవిత్ర స్తలాలని ప్రసిద్ది. ఇవి సిద్ద ప్లేసెస్ అని అంటారు. ఇక్కడకు యిప్పటికీ దేవతలు వస్తుంటారని చెపుతారు. ఇక్కడ మహాలక్ష్మి టెంపుల్ ఉంది. అమ్మను దర్శించు కొని బయలు దేరాము.
తుంగభద్ర ప్రాజెక్ట్ చూద్దామని బయలు దేరాము. డాం కి జస్ట్ 5kms ముందు 'హులిగి' అనే గ్రామం ఉంది. అక్కడ గ్రామ దేవత హులిగమ్మ టెంపుల్ చాలా ప్రసిద్ది చెందింది. అమ్మ దర్శనం అయ్యేసరికి నియర్లీ 7pm అయింది. రైన్ కుడా పడుతుంది. హులిగి లో హాట్ హాట్ మిర్చి బజ్జి తిని టీ తాగాము. మేము తిరిగిన నాలుగు జిల్లాలలో మిర్చి బజ్జిలు అంతటా ఉన్నాయి. వర్షం కారణంగా dam చూడకుండానే హోటల్ రూం కి చేరాము. ఇది మొదటి రోజు మా టూర్ విశేసహాలు. చాలా బాగా జరిగింది. అన్నట్లు కార్ కి ఒకరోజు టూర్ కి ఇవన్ని చూపించేందుకు గాను Rs.1000/- తీసుకున్నారు. జనరల్ గా Rs. 1200/- లోపు గానే తీసుకుంటారట.
ఓకే నేను నా టూర్ లోని సెకండ్ డే గురించి వ్రాస్తాను. ఫస్ట్ డే మేము రూంకి చేరాక, స్నానాదికాలు కానిచ్చి, ఈవెనింగ్ టిఫెన్ చేసి, సరదాగా ఒక కన్నడ "డ్రామా" కు వెళ్ళాము. అక్కడ ఇప్పుడు కుడా డైలీ నాటకాలు జరుగుతూ ఉన్నాయి మరి. సరిగ్గా అర్ధ కాలేదు కాని ఓకే బాగానే ఉందని చెప్పుకో వచ్చు. సెకండ్ డే మార్నింగ్ మేము "సెట్ దోసె" తిని బస్సు లో హంపికి చేరాము.
అక్కడ నిన్న చూడటం కుదరని ఇంపార్టంట్ ప్లేసెస్ చూసేందుకు. వాటికి వెళ్ళాలంటే తప్పకుండ నడిచే వెళ్ళాలి మరి. హంపి విరుపాక్షస్వామిని మరొక్క సారి దర్శించుకొని, అక్కడ కోదండరామ టెంపుల్ కి వెళ్ళాము. సెంటర్ నుండి సుమారు 1km ఉంటుంది. ఈ ప్లేస్ చాలా అందంగా ఉంటుంది. టెంపుల్ కి ముందు తుంగభద్రా నది ప్రవహిస్తుంది. కొండలు ఇక్కడ చాలా చిత్రంగా ఉంటాయి, ఎవరో పెద్ద పెద్ద రాళ్ళను తెచ్చి కుప్పలుగా పోసినట్లు చాలా గొప్ప అందాన్ని ప్రదర్స్తిస్తూ ఉంటాయి. కోదండరాముని సన్నిధికి వెళ్ళేప్పుడు రెండు పెద్ద రాళ్ళ మధ్యలో నుండి ఒక సొరంగ మార్గంలో వెళుతున్నట్లు వెళ్ళాలి, మంచి అనుభూతిని ఇస్తుంది ఆ నడక. స్వామి సీతా లక్ష్మణ సమేతుడై చాలా అందంగా ఉన్నాడు. శాంత గంభీర మూర్తి ఐన స్వామిని దర్శించుకొని అక్కడ కొంచం ఎత్తులో వున్నా 'సూర్యనారాయణ దేవాలయం' చూసుకొని, దానికి కొంచం ఎత్తులో ఉన్న "ఆంజనేయస్వామి" దేవాలయానికి వెళ్ళాము. ఈ స్వామి ప్రత్యేకత ఏమిటంటే "శ్రీయంత్రం" లో ఆంజనేయస్వామి ఉంటారు. చాలా ప్రత్యేకత కలది. ఆ రోజు శనివారం కుడా నేమో చాలా మంది స్వామి దర్శనానికి వచారు. స్వామి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని బయటకు వచాము. అక్కడ హాట్ హాట్ బజ్జి వేస్తుంటే తిని ముందుకు కదిలాము.
ఇప్పుడు ఒక ప్రసిద్దమైన ప్లేస్ చూసేందుకు బయలు దేరాము. అది 'ఋష్యమూక' పర్వతము. రామాయణంలో సుగ్రీవుడిని రాముడు మొదటిగా కలసిన చోటు గుర్తే కదా. అదే ఈ పర్వతము. వాలి ఈ కొండమీదకు రాకుడదని శాపం కావున సుగ్రీవుడు అక్కడ ఉంటుంటాడు. మేము అక్కడకు వెళ్ళాము. అక్కడ ఒక చిన్న గుహ ఉంది. ప్రెసెంట్ అక్కడ ఏమిలేదు. ఇంతకు ముందు నేను చుసినప్ప్లుడు ఎవరో ఒక సాధువు అక్కడ పూజలు అవి చేస్తూ ఉండేవాడు. ప్రెసెంట్ మాత్రం అక్కడ ఎవరు లేరు. అక్కడ ఒక్కసారి సుగ్రీవ రామ స్నేహ ఘట్టాన్ని గుర్తుతెచుకొని, అక్కడకు కొంచం దూరంలో ఉన్న 'పురందరదాసు మండపం' వద్దకు వెళ్ళాము. కొదండరామాలయానికి పురందరదాసు మండపానికి సుమారు 1.5km ఉండవచును. అయితే పురందరదాసు మండపం తుంగభద్రా ప్రవాహంలో మునిగి ఉంది. మండపంలో సుమారు two ఫీట్ లోతు నీరు ప్రవహిస్తుంది. తుంగభద్రలో కాళ్ళు కడుక్కొని, తలమీద నీళ్ళు చల్లుకొని, పురందరదాసు కీర్తన ఒకటి పాడుకొని రిటర్న్ అయ్యాము. ఇక్కడ ఒక చిన్న బాధ ఏమిటంటే నదికి ఆవల చింతామణి అనే ప్లేస్ లో వాలిని రాముడు చంపాడట, ఇంతకు ముందు వచినప్పుడు కుడా నేను చూడలేక పోయాను. ఈ సారి తుంగభద్రా వరద కారణంగా చూడలేక పోయాము. అయితే మేము నిన్ననే చూసాము కనుక అక్కడకు జస్ట్ ఫర్లంగ్ దూరంలోనే ఉన్న 'vittal టెంపుల్' కి వెళ్ళకుండానే తిరిగి హంపి bastandki చేరాము. హంపి వీధులలోని షాప్స్ అవిచుస్తూ, విరుపాక్ష టెంపుల్ ఘాట్ కి వెళ్ళాము. అది కుడా చాలా సుందరంగా ఉంది.
అవి చూసాక బస్సు లో తిరిగి హాస్పేట్ వచ్చాము. భోజనం చేసి వన్ హవర్ రెస్ట్ తీసుకొని, తుంగభద్రా dham వద్దకు వెళ్ళాము. అక్కడ కుడా సుమారు రెండు కి.మీ.లు నడవాలి. అక్కడ పార్క్ చాలా బావుంది. డాం కుడా చాలా బావుంది. నీరు నిండుగా ఉంది. అక్కడ జలాశయాన్ని చూస్తూ నిలబడితే అలలు ఎగసి మామీద నీళ్ళు పడ్డాయి. చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ నుండి చిన్నగా నడచుకుంటూ పార్క్లోకి వెళ్ళాము. దారిలో ఆంధ్ర నుండి వచ్చిన మహిళా మండలి వాళ్ళు కనిపించారు. వాళ్ళు సంవత్సరానికి కనీసం రెండు ట్రిప్స్ అయినా వేలుతున్తారట. వాళ్ళల్లో పెద్ద వయసువాల్లె ఎక్కువ. వాళ్ళ వోపికకు ముచ్చటేసింది. పార్క్ చాలా చాలా బావుంది. బృందావన గార్డెన్ కి మల్లె వాటర్ ఫౌంటైన్స్ ఏర్పాటు చేసారు. కర్ణాటక ప్రభుత్వ పనితీరు చూసి మన నాగార్జున సాగరు తలచుకొని మన పాలకుల నిర్వాకాన్ని తిట్టుకున్నాము. అక్కడ నెమళ్ళు, ఇంకా కొన్ని రకాల పక్షులు ఉన్నాయి, అలాగే జింకలు, దుప్పులు కుడా ఉన్నాయి. అవన్నీ ఒక చిన్న జూ ఏర్పాటు చేసి చూపిస్తున్నారు. ఆ పార్క్ ఎంట్రన్సు ఫి రూ. ౧౦/- అనుకుంటాను. అలాగే అక్కడ ఒక aquarioum కుడా ఉంది. అవన్నీ చూసే సరికి సాయంత్రం ఏడు గంటలు ఐంది. సెవెన్ thirthy కి musical dancing fountain show ఉందంటే ఆ పర్క్లోనే కబుర్లు చెప్పుకుంటూ వెయిట్ చేసి, ఆ షో చూసాము. పరవాలేదు. మన విజయవాడ లో రాజీవ్ పార్క్లో కుడా అలాంటి షో ఉన్నది కదా. అది చూసి రూం కి చేరాము.
అంతకన్నా ముందే అనగా మధ్యాహ్నం భోజనానంతరం హోటల్ వాళ్ళే పిలిపిస్తే త్రీ డేస్ కి కార్ మాటలాడాము. ఇండికా కార్ per km Rs.5.50/- ki మాటలాడాము. per day 300kms జర్నీ ఇవ్వాలి. డ్రైవర్ మామూలు per day two hundred rupees. రీజనబుల్ గానే ఉంది రేట్. ఇంకెవరిని అడిగినా మినిమం per km rs. 6/- కి తక్కువ రామని చెప్పారు. ఇక ఆరోజుకి రెస్ట్ తీసుకుంటూ నిద్ర పోయాము. కల్యాణి చాళుక్యుల శిల్పకళా వైభవ దర్శన యాత్రా విశేషాల గురించి తరువాత పోస్టుల్లో తెలియ జేస్తాను.
మిత్రులారా బోర్ కొట్టిన్చానేమో అని కొంచం సందేహం, మీ అభిప్రాయాలు తెలియజేస్తే పరవాలేదనుకుంటే ఇక ముందు నేను చేసే అన్ని యాత్రా విశేషాలు తెలిజేసే సాహసం చేస్తా
హంపి విశేషాలు చాలా ఆసక్తికరం గా,కళ్ళకు కట్టినట్టు గా తెలియజేసారు .అభినందనలు ఫొటోస్ కూడాచాలా బాగా వచ్చాయి
ReplyDeleteChaala baagunani
ReplyDeleteఅద్భుతమైన విషయం
ReplyDeleteఅద్భుతమైన విషయం
ReplyDelete