Search here for what you are looking...

కళ్యాణి చాళుక్యుల శిల్పకళా వైభవ యాత్ర KALYANI CHALUKYULA SILPAKALAA VAIBHAVA YAATRA

హాయ్ ఫ్రెండ్స్,
                        కళ్యాణి చాళుక్యుల దేవాలయాల నిర్మాణం ఆరవ శతాబ్దం లో జరిగింది. అలాంటి దేవాలయాలను 28 August to 30th ఆగష్టు రోజులలో దర్శించుకున్నాము. ఆ వివరాలు తెలుపు తున్నాను.   (ఫోటోలు త్వరలో జతపరుస్తాను)

                    మేము హోస్పేట నుండి మా ప్రయాణం మొదలు పెట్టాము. ఆ వివరాలు ముందటి హంపి యాత్ర లో  వివరించాను. ఇండికా కార్ మతలాడుకున్నాము త్రీ డేస్ కు. రోజుకు ౩౦౦ kms ప్రయాణం మనం చేసేటట్లుగా km కు Rs.5.50/- రేట్ చొప్పున మాటలాడి నాము ముందురోజే.

                           మొదటిరోజు అనగా 28th ఆగస్ట్ 5am కి స్టార్ట్ అవాలని చెప్పాము కార్ వాడికి. వాడు మాములుగానే 5 .30 am కి వచ్చాడు. మేము బయలుదేరే సరికి 6 అయింది. స్నానాలు కుడా చేయలేదు, జస్ట్ కాఫీ త్రాగి బయలు దేరాము. హస్పేట్ నుండి డైరెక్ట్ గా కూడలసంగమం చేరాము. జర్నీ 123kms , యెన్.హెచ్ రోడ్ అయినా రోడ్ వర్క్ జరుగుతుంది కనుక ప్రయాణం టైం తీసుకుంది. త్రీ హవర్స్ పట్టింది. అయితే మధ్యలో Hungund టౌన్ కి జస్ట్ ఐదు కి.మీ.లో రుద్రేశ్వర టెంపుల్ అని ఫేమస్ టెంపుల్ వుంది, కాని దానిని దర్శించు కోలేక పోయాము, సమయా భావం వలన. కూడలసంగమం చేరి అక్కడ కృష్ణా నదిలో స్నానం చేసాము. అన్నట్లు కూడలసంగమం ప్రత్యేకత ఏమిటంటే అక్కడ వీరశైవ మత స్తాపకుడు బసవేశ్వరుడు సాధన చేసి సిద్ది పొందిన స్తలమిది. ఇక్కడ మలప్రభ అను నది కృష్ణా నదిలో కలుస్తుంది, అంతేకాక ఇక్కడ ఇంకో మూడు చిన్న నదులు కుడా కలుస్తాయి. అందుకే దీనిని పంచ గంగా సంగమం అని కుడా పిలుస్తారట. ఇక్కడ ఊరు లేదు కాని కేవలం బాసవేస్వరుని సంస్థ ప్రధాన కార్యాలయం, ఆశ్రమం ఉన్నాయి, చాలా అందంగా ఉంది ఈ స్తలము, ఆశ్రమ నిర్మాణాలు. పెద్ద సంగమేశ్వర స్వామి టెంపుల్ ఉంది. కృష్ణ నది వొడ్డునే చాలా గొప్పగా ఉంది. అలాగే ఇంకొక ప్రత్యక నిర్మాణం ఇక్కడ ఏమిటంటే బాసవేస్వరుని సమాధి మందిరము. వాస్తవానికి సమాధి, జూరాల ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వలన మునిగి పోతుంటే, ఆ సమాధి చుట్టూ సుమారు నూరు అడుగుల ఎత్తున గుండ్రంగా ఒక కట్టడం కట్టినారు. దానిలోపలకు దిగి సమాధి దర్శించుకోవటం నిజంగా చాలా గొప్పగా ఉంది. ఒక మహాత్ముడి దర్శనంతో మా ఈ త్రీ డేస్ యాత్ర స్టార్ట్ అవడం సంతోషం కలిగించింది. దర్శనాలు ముగించుకొని నిత్య గాయత్రి అగ్ని హోత్రం చేసుకున్నాము కృష్ణమ్మ వొడ్డున కూర్చొని. అక్కడ అల్పాహారం తీసుకున్నాము. అయితే అంత మంచిగా లేదు. అక్కడ నుండి బయలుదేరాము.
            next  ప్రయాణం కళ్యాణి చాళుక్యుల శిల్ప సంపదను వెల్లడిచేయు చున్న సుమారు 20 ప్లేసెస్ దర్శించు కోవడం. అందులో మొదటిది "ఐహోల్". కూడలసంగమం నుండి 37kms , కూడలసంగమ నుండి 24kms లో అమీన్ గడ్ అను చిన్న టౌన్ ఉంది ఐహోల్  వెళ్ళు దారిలో, అక్కడ మనకు బందరు లడ్డుకి ఫేమస్ లా, తాపేశ్వరం కాజ ఫేమస్ లా, ఆ వూరు కర్ణాటక స్పెషల్ స్వీట్ 'కరదంటు' కు ఈ అమీన్ గడ్ ఫేమస్ అంట, కార్ డ్రైవర్ చెపాడు, కార్ ఆపి ఆ స్వీట్ తీసుకున్నాము, బాగుంది. అది మన డ్రై ఫ్రూట్ లడ్డు టెస్టులో ఉంది. ఆ రోడ్ single రోడ్ అయినా పరవాలేదు బాగానే ఉంది. ఐహోల్ వెళ్ళితే కొన్ని temples ఒకే చోట ఉన్నాయి, క్రి.శ.500 to 700 మధ్యలో ఆ దేవాలయాలని  కట్టినారట. ఇక్కడ సుమారు నూరు టెంపుల్స్ కన్నా ఎక్కువ ఉన్నాయట. అందులో ప్రసిద్ది చెందిన ఒక పది దేవాలయాలు చూసాము. అయితే అవేవి కుడా పూజ పునస్కారములు జరుగుతున్న దేవాలయాలు కాదు. అనికూడా అర్చిలజికాల్ వారి అధీనంలో ఉన్న టెంపుల్స్, చక్కని పచ్చికతో పార్క్స్ ఏర్పాటు చేసారు. నిజంగా ఆ దృశ్యాలు చూస్తుంటే కన్నుల పండువగా అనిపించింది. ఏదో లోకంలో ఉన్న భావన మనసంత నిండి పోయింది. అక్కడ 'దుర్గ టెంపుల్', 'సూర్యనారాయణ టెంపుల్', 'మల్లిఖార్జున టెంపుల్', 'రావణపడి కేవ్ టెంపుల్' కొండమీది 'బుద్ధా టెంపుల్' ఇలా చాలా చూసాము. చాలా గొప్పగా అనిపించాయి. అక్కడ ఉన్న ఒక ఎంప్లాయ్ ''సర్ ఇది ప్రైమరీ లెవెల్, బాదామి హై స్కూల్ లెవెల్, పట్టడికల్ కాలేజీ లెవెల్'' అని చెప్పాడు. ఐహోల్ ఒక చిన్న గ్రామము. అక్కడ నైట్ బస చేసేందుకు వసతులు లాటివి ఏమి లేవు. 
                              


          అక్కడ నుండి 17kms లో ఉన్న పట్టడికల్ కు బయలు దేరాము. దారి చాలా సుందరంగా ఉంది. చుట్టూ కొండలు, అడవి మధ్యలో ప్రయాణం మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉంది. అంతలోనే పట్టడికల్ రానే వచ్చింది. అక్కడ ఉన్న దేవాలయాలు అన్నికుడా ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. 'కాశివిశ్వేశ్వర టెంపుల్', 'గొలగనాధ టెంపుల్', విరూపాక్ష టెంపుల్, మల్లికార్జున టెంపుల్, సంగమేశ్వర టెంపుల్ ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఇక్కడ కుడా ఎక్కడ పూజలు లేవు. దేవాలయాల సౌందర్యాన్ని ఆస్వాదించడమే, మేము అందరం ఎంతో త్రిల్ ఫీల్ అయ్యాము ఆ టెంపుల్స్ అందాలు చూసి. ఆనాటి మహారాజుల కృషి ఎంత గొప్పగా ఉందిరా, వాళ్ళు పోయినా వారు ఇచ్చిపోయిన సంపద మిగిలి పోయింది కదా అని చాలా ఆనందించాము. ఆ టెంపుల్స్ గురించి వ్రాయాలని ఉంది కాని అంత గొప్ప వర్ణన నేను చెయ్యలేనని వదిలేస్తున్నాను. అది చూసుకొని 'మహాకూట్' కు బయలుదేరాము, అక్కడకు 15kms దూరం. 
                                             మహాకూట్ చాలా గొప్పగా ఉంది, ఇక్కడ పూజాదికాలు అన్ని జరుగుతున్నాయి. పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఒక కోనేరు ఉంది. మన మహానంది లోని కోనేరు లానే చాలా పెద్దగా, అయిదు అడుగుల లోతు నీళ్ళతో స్నానాలకు చాలా బాగుంది. చాలా మంది కోనేరులో ఈదులాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మేము టైం permit చేయ్యదులే అని దిగలేదు. అయితే కొంచం బాధకరమైన విషయం ఏమిటంటే అక్కడ కోనేరు లోకి దిగటానికి డబ్బు తీసుకుంటున్నారు అదీ వితౌట్ రిసీట్. స్వామి మహాకూటేస్వరుడు. చాలా గొప్పగా ఉంది స్వామి దర్శనం, భక్తులు సుమారు ఫైవ్ థౌజండ్స్ వచ్చినట్లున్నారు. అక్కడ చెరుకు రసం త్రాగి దర్శనానంతరం అక్కడకు 7kms  లో ఉన్న 'బాదామి'కి  బయలు దేరాము. బాదామి ఒకరకమైన టౌన్. అన్ని వసతులు ఉన్నాయి. 
                         ఇది చాలా ప్రసిద్ది చెందినది. బాదామి చాళుక్యులుగా ఆనాటి రాజులకు పేరు ఉంది అంటే ఈ పట్టణం ఒకనాడు ఎంత శోభను పొంది ఉంటుందో అర్ధం చేసుకో వచ్చును. ఇది రాజధానిగా ఉండేదట. ఇక్కడ అగస్త్య మహాముని తపస్సు చేసాడని, అయన వరప్రసాదంగానే ఇక్కడ అగస్త్య కోనేరు ఏర్పడిందని చెపుతారు. ఈ పట్టణానికి నార్త్ న  ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ నానుకొని చాలా పెద్ద కోనేరు ఉంది. ఆ కోనేరులోనే భూతనాథ్  టెంపుల్ ఉంది. దానిని వర్ణించడం చేతకాని నా అసక్తతకు నేను నిజంగా బాధ పడుతున్నాను. చాలా గొప్పగా ఉంది. ఎదురుగా పెద్ద కోనేరు దానిలో ఆ గుడి దానికి బ్యాక్ డ్రాప్ లో కొండ  ఓహ్  నేను భావకుడనే కాని ఆ భావాలను వ్యక్త పరచాలేకున్నాను కాని లేకుంటే ఆ అందాలను వర్ణించడానికి ఎన్ని పేజెస్ మేటర్ కావాలో కదా. ఆ కొండ మీద ఆది మానవులు నివసించారని చెపుతారు. ఇప్పుడు అక్కడ ఒక ప్రదర్శనలా ఏర్పాటు చేసారు, దూరం నుండి చూడడమే తప్ప ప్రజెంట్ అక్కడకు వెళ్లేందుకు దారి సరిగా లేదు, ఆ బొమ్మలు అవి సరి అయిన పోషణ లేక దెబ్బతిని పోయాయట. చాలా పెద్ద బొమ్మలతో ఆ ప్రదర్శన ఏర్పాటు చేసినారు. బాగుండి ఉంటె ఎంత ఆనందించే వారిమో, అనిపించింది. అలాగే పురాతన శిలాశాసనాలు కుడా అక్కడ కొండ గుహలో దర్శించు కుని, బాదామి కేవ్ టెంపుల్స్ కి వెళ్ళాము.  మొత్తం నాలుగు గుహాలయాలు ఉన్నాయి. అందులో రెండు విష్ణు గుహలు, ఒకటి శైవ, ఒకటి జైన గుహ. శైవ గుహ మొదటగా వచ్చింది, దానిలో మహిసాసుర మర్ధిని అమ్మవారి శిల్పం చాలా గొప్పగా ఉంది, అలాగే నటరాజు శివుని శిల్పం కుడా ఎంతో గొప్పగా ఉంది. వినాయకుడు ఇంకా కొన్ని శిల్పాలు ఆ కొండకే చెక్కి ఉన్నాయి. గుహా, గుహలోని శిల్పాలు అన్ని ఆ కొండ రాతిలోనే మలిచారు, ఏమాత్రం చిన్న తేడా వచ్చినా అంతా పనికిరాకుండా పొంతుంది. ఎంత ప్రణాళికతో చేస్తేనో అది చెయ్యగలగటం. అలాగే విష్ణు కేవ్స్ కుడా గొప్ప అందాలతో విరాజిల్లుతున్నాయి. అక్కడ త్రివిక్రమ, వరాహ, నారాయణ శిల్పాలు నిజంగా దర్శించాల్సిందే తప్ప మాటలలో చెప్పలేము వాని గొప్పదనాన్ని గురించి. అలాగే జైన గుహ కుడా చాలా బావుంది. అవి అన్ని కుడా కొండ మీద ఉన్నాయి సుమారు 150 స్టెప్స్ వరకు ఎక్కి చూడాలి. టికెట్ Rs.10/- per person. ఆ కొండ మీద నుండి అగస్త్య కొలను, భూతనాధ టేoపుల్ అందాలు కడు రమ్యంగా, కనులకు విందును చేకూరుస్తూ కనిపిస్తున్నాయి. టైం కుదరక ఆ రోజు మేము భోజనం చెయ్యలేదు,  మంచి హోటల్ కూడా కనిపించలేదు. బాదామి లో ఉడిపి హోటల్ లో మనవాళ్ళు టిఫెన్ చేసారు. నేను జస్ట్ కాఫీ మాత్రమే తాగాను. ఏమి తినాలని పించలేదు నాకు. 
                             అక్కడ నుండి బాణశాంకరి జస్ట్ fivekms కి వెళ్ళాము. అక్కడ అమ్మవారు శాకంబరి దేవి, చాలా గొప్పగా ఉంది. అక్కడ కుడా మంచి కోనేరు ఉంది. పూజలు జరుగు తున్నాయి, భక్తులు కుడా ఉన్నారు పరవాలేదు. టెంపుల్ బాగుంది. అక్కడ దీప స్తంభాలు చాలా ప్రత్యేకతతో ఉన్నాయి. అక్కడ నుండి 32kms లో ఉన్న 'sudi ' అనే ఊరు చేరాము. ఇక్కడ జంట గోపురముల దేవాలయం ఉంది. చాలా మంచి కట్టడం. కట్టడం చిన్నదే అయినా గొప్ప శిల్ప సంపద. పక్కనే పెద్ద శివలింగం, పెద్ద బసవన్న, పెద్ద వినాయకుడు చాలా బాగున్నాయి. అన్ని భారి సైజెస్ లో ఉన్నాయి, పక్కనే నాగకుండం అని చాలా పెద్ద బావి ఉంది. దాని నిర్మాణం అనిర్వచనీయం. అలాగే మల్లికార్జున టెంపుల్ కుడా దర్శించుకొని, అక్కడకు 4kms లో ఉన్న 'ఇటగి' అనే గ్రామం వెళ్ళాము. అక్కడ భిమాంబిక టెంపుల్ ఉందంటే వెళ్ళాము, వెళ్ళాక తెలిసింది అది కళ్యాణి చాళుక్యుల టెంపుల్ కాదు, ఒక అవధూత అమ్మవారి టెంపుల్, అక్కడ భక్తులు చాలా మంది వున్నారు. తెలియకుండానే ఒక అవధూత దర్శనం కావడం మాకు చాలా ఆనందం కలిగించింది. అమ్మ సమాధిని దర్శించుకొని తిరిగి  sudi  గ్రామం చేరి గజెంద్రగడ్ చేరాము. అప్పటికి టైం సెవెన్ థర్టీ అయింది. అందుకని ఆ రాత్రికి అక్కడే బస చెయ్యాలని నిర్ణయించుకొని బస్టాండ్ దగ్గరే ఉన్న ఒక హోటల్ లో రూమ్స్ తీసుకున్నాము. చాలా నీట్ గా ఉంది. హోటల్ పేరు బృందావన్, రూం రెంట్ per day Rs.450/-. నలుగురుము ఉన్నాము కనుక రెండు రూమ్స్ తీసుకున్నాము. బజార్ వెళ్లి భోజనం చేసి వచ్చి, అలసిపోయమేమో బాగా నిద్ర పోయాము.   


         ఇక రెండవ రోజు 29th ఆగష్ట్,  గజెంద్రగడ్ లో ఉదయం నిద్ర లేచి, స్నానాది కార్యక్రమాలు ముగించి గాయత్రీ నిత్యాగ్ని హోత్ర కార్యక్రమం ముగించి ఆ ఉరిలో ఉన్న 'కాలకాలేశ్వర స్వామి' దేవాలయానికి వెళ్ళాము. అది ఊరికి సుమారు 3kms దూరంలో కొండమీద ఉన్నది. స్వామి చాలా పవర్ ఫుల్ అని చెప్పారు. నిత్య పూజలు జరుగు తున్నాయి. భక్తులు కుడా చాలా మంది వచ్చారు. శ్రావణమాసం పూర్తీ అయిన రోజు అని చాలా మంది స్వామి దర్శనానికి వచ్చారు. కొండమీదకు సుమారు 150  వరకు మెట్లు ఉన్నాయి. కొండ పైన స్వామి వద్ద కొండపైనుండి ఒక జలపాతం పడుతుంది. అది పెద్ద ధారగా కాక వర్షపు చినుకుల్ల పడుతున్నాయి, చాలా మంది స్నానాలు కుడా చేస్తున్నారు.  స్వామి దర్శనం చేసుకొని కొండ దిగి వచ్చాము. తిరిగి గజెంద్రగడ్ టౌన్ లోకి వచాము. మన వాళ్ళు అందరు ఆ రోజు దోశలు తినాలనుకున్నారు. అయితే గమ్మత్తుగా ఆ వూరి మొత్తం మీద ఉదయం దోసెలు దొరకలేదు. అక్కడ ఉదయం ఓన్లీ ఇడ్లీ, పూరి, ఉప్మా  మాత్రమె  ఉన్నాయి, అక్కడ ఉన్న ఉడిపి హోటల్ కి వెళ్ళాము, వాళ్ళను అడిగితే ఆ వూరి మొత్తంలో కుడా 11am తరువాతనే దోశలు దొరుకుతాయని చెప్పారు. మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అలా ఆరోజు మొదలు పెట్టాము. 
                        తరువాతి క్షేత్రం 'కుక్నూర్' గజేద్రగడ్ నుండి 35kms అక్కడకు  'yelbarga '  అను చిన్న టౌన్ మీదగా చేరాము. కుక్నూర్ కుడా తాలుకా కేంద్రం, ఇక్కడ ఒక అద్భుత దేవాలయం ఉంది. 'మహామాయదేవి' ఆలయము అది. అమ్మవారు చాలా శోభతో అలరారు తున్నారు. అమ్మవారు అక్కడ సరస్వతి, లక్ష్మి, పార్వతి మూడు రూపాలలో కనిపిస్తుంది. పూజాదికాలు చాలా శ్రద్దగా చేస్తున్నారు పూజారులు. అమ్మ దర్శనం మానసికంగా ఎంతో చెప్పలేని అనిర్వచనీయ ఆనందాన్ని కలిగించింది. అక్కడ ఉన్న ఇంకో అద్భుతం 'నవలింగ టెంపుల్' . ఆ గుడి కుడా అమ్మవారి టెంపుల్ ప్రాంగణంలోనే ఉన్నది. నవలింగా టెంపుల్ నందు తొమ్మిది లింగాలను, తొమ్మిది గుడులలో ఒకదానిని ఇంకోదానికి అనుసంధానం చేస్తూ ఒకే కప్పుక్రింద నిర్మించారు. అందులో ఎనిమిది లింగాలు జ్యోతిర్లింగాల లోనివి, ఒకటి మాత్రం మార్కండేయ లింగం. అన్ని దేవాలయాలలో విశేషంగా పూజలు జరుగుతున్నాయి. గుడులు చిన్నవే అయినా చాలా బాగున్నాయి, అక్కడ దర్శనం ఐన తరువాత పక్కనే 8kms లో  ఉన్న 'ఇటగి' అనే గ్రామం చేరాము. నిన్న కుడా ఒక 'ఇటగి' గ్రామం చూసాము. అక్కడ భీమాంభిక అమ్మ దేవాలయం చూసాము కదా. మరి ఈ 'ఇటగి' గ్రామం ఇంకోటి నిన్నటిది కాదు. ఈ ఇటగి లో ఉన్న దేవాలయం  'మహాదేవ టెంపుల్'. ఇది చాలా అద్భుతమైన కట్టడము. శిల్పసంపద కడురమ్యము. నిన్నంత చూసిన  దేవాలయాలలో ఉన్న శిల్ప శైలికి భిన్నంగా ఈ దేవాలయం ఉన్నది. అతి సున్నితమైన, సన్నచేక్కుబడి తో నిర్మించారు. ఆ దేవాలయ శోభను చూస్తుంటే కదల బుద్ది అవలేదు. ఆ దేవళం పక్కనే పెద్ద బావి చాలా అందంగా ఉన్నది.                                                              
                               ఇటగి మహాదేవ దర్శనానంతరం ఇక్కడకు 33kms లో ఉన్న 'దంబాల్' అను గ్రామం వెళ్ళాము. అక్కడ 'దొడ్డబసప్పఈశ్వర దేవాలయం', సోమేశ్వర దేవాలయం ఉన్నాయి. దొడ్డ బసప్పేశ్వర దేవాలయం ఎదురుగా పెద్ద నంది ఉంది. చాలా శోభాయమానంగా ఉంది. మేము వెళ్లేసరికి కొంతమంది భక్తులు నందీస్వరునికి చక్కగా అలంకరణ చేస్తున్నారు.స్వామి దర్శనం చేసుకొని జస్ట్ ఎదురుగానే ఉన్న సోమేశ్వరాలయానికి వెళ్ళాము. అయితే ఇక్కడ పూజలు అవి లేవు. దేవాలయం బాగాఉంది. ఇక్కడ కార్ చిన్న ఇబ్బంది పెట్టింది. మా మనసులు ఎలా ఒక్కొక్క దేవాలయం చూస్తూ ఉరకలు వేస్తూ   వెనక చుపులేకుండా ముందుకు పరుగులు తీస్తున్నాయో, అలాగే కార్ కి కుడా రివర్స్ గేర్ పడటంలేదు. అది చిన్న గ్రామం కనుక కార్ మెకానిక్ లేడని, ముందు వున్న టౌన్ 'శిర్హట్టి'కి  37kms  జాగ్రత్తగా వెళ్ళాము. వెళ్ళాము అనే దానికన్నా డ్రైవర్ బాగా తోలాడంటే  బాగుంటుందేమో. శిర్హట్టి సెంటర్ లో మమ్మలను దింపి డ్రైవర్  రిపేర్ కోసం వెళ్ళాడు. 
                               మనవాళ్ళు భోజనం చేస్తుంటే నాకు భోజనం చేయాలనీ పించక పోతే, నేను హోటల్ బయట కుర్చుని ఉంటె ఒకతని సెల్ లో కన్నడ పాట వస్తుంది. అందులో 'వందనమయ్య శిర్హట్టి పకీరప్ప స్వామీ' అని వినిపించింది. దానితో అక్కడ ఎవరో మహాత్ముడున్నాడని అర్ధం అయి వారిని ఎంక్వయిరీ చేసాను. అక్కడ పక్కిరప్ప అను మహాత్ముడి ఆశ్రమం ఉందని, అయన సమాధి కుడా అక్కడ ఉందని చెప్పారు. అప్పుడు అర్ధం అయింది, కార్ ఎందుకు ఇబ్బంది పెట్టిందో? వాస్తవానికి మా ప్రోగ్రాం లో ఈ స్వామి దర్శనం లేదు. కారణం మాకు ఆయన గురించే తెలియదు కదా.  కార్ రిపేర్ లేకపొతే ఆ టౌన్ లో ఆగే వాళ్లము కాదు, అయన గురించి తెలిసేది కాదు, అలా ఆ మహాత్ముని గురించి తెలుసుకొని సెంటర్ కి జస్ట్ ఫర్లంగ్ దూరం లో ఉన్న ఆశ్రమానికి వెళ్ళాము. చాలా పెద్ద ఆశ్రమమది. కొన్ని వేలమంది భక్తులు ఉన్నారక్కడ, peetadhipathini  దర్శించు కున్నాము. అయన ఆశీర్వదించి భోజన ప్రసాదం తీసుకోండి అని తెలుగులో చెప్పారు.  నా ఆనందానికి అవధులు లేవు. కారణం నాకు అంతకు ముందు మనవాళ్ళు మీల్స్ చేసినప్పుడు తినాలని అనిపించలేదు. ఇప్పుడు స్వామి ప్రసాదం తీసుకొనే అవకాశం రావటం నిజంగా ఆ జగద్గురువు పకీరప్ప స్వామి నాపైన చూపించన కరుణే అని అర్ధం అయి ఆనందాతిరేకం తో అశ్రునయన పూరితున్నై భోజన శాలకు వెళ్ళాము. మిగిలిన మనవాళ్ళు జస్ట్ ఒక్క ముద్ద నా వద్ద పెట్టించు కొని తిన్నారు. నేను మాత్రం స్వామి ప్రసాదాన్ని ప్రశాంతంగా తీసుకున్నాను. తరువాత పకీరప్ప స్వామి సమాధి దర్శనానికి వెళ్ళాము. అక్కడ పెద్ద క్యు ఉన్నది. అయిన వెయిట్ చేసి దర్శించుకున్నాము. ఈ స్వామి హిందూ ముస్లిం లిద్దరికీ గురువు అట, అందుకే ఆశ్రమం లో స్వామి సమాధి, మరియు స్వామి దర్గా రెండు వున్నాయి. రెండు మతాలవారు శ్రద్ధతో స్వామి దర్శనం చేసుకుంటున్నారు. మా దర్శనం అయి అలా కూర్చున్నాము. డ్రైవర్ కాల్ చేసాడు 'సార కార్ రెడీ' అని తనను కుడా ఆ ఆశ్రమానికి  రమ్మని ఆ స్వామి కరుణకు ఎలా పాత్రుల మైనమో తలచుకుంటూ బయలు దేరాము.
                         మా తరువాతి దర్శన స్తలం 'లక్ష్మేస్వర్' అది 21kms లో ఉన్నది.  ఇది కుడా చాలా ప్రసిద్ది చెందిన క్షేత్రమాట. ఇక్కడ లక్ష్మిలింగేశ్వర టెంపుల్, సోమేశ్వర టెంపుల్ ఉన్నాయి. సోమేశ్వర టెంపుల్ నందు ఇప్పుడు కుడా పూజాదికాలు జరుగు తున్నాయి. సోమేశ్వర టెంపుల్ చాలా చక్కని శిల్పాలతో శోభలను వెదజల్లుతుంది. లక్ష్మి లింగేశ్వర టెంపుల్ లో మాత్రం ఎటువంటి పూజలు లేవు, దేవాలయం కుడా బాగా పాడుబడి ఉంది. సోమేశ్వర టెంపుల్ లో ఒక పెద్ద బావి కుడావున్నది. అదికూడా చాలా బాగుంది. ఇక్కడ జైన టెంపుల్ కుడా బాగుంది. 
                               అక్కడ నుండి 37kms లో ఉన్న బంకాపూర్ వెళ్ళాము. అది ఒక నాడు చాలా గొప్పగా వెలిగిన పట్టణం. ఆనాటి రాజులకు రాజధానిగా విలసిల్లినది. అక్కడ ఉన్న ఫోర్ట్, నెమళ్ళ పార్క్ తప్పని సరిగా దర్శించ దంగింది. చిన్న తువ్వర పడుతుందేమో, మయురాలు పురివిప్పి నాట్యం చేస్తుంటే చుసిన కన్నులే కన్నులు అనిపించింది. ఒకటి కాదు రెండు కాదు వందల నెమళ్ళను ఒక చోట చూడటం చాలా ఆనందాన్ని కలిగించింది. (ఇలా అనేక నెమల్లు ఒకచోట మేము తమిళనాడు లో తిరుచ్చెందురు నుండి కన్యాకుమారి వెళుతున్నప్పుడు చూసాము. చాలా బాగుంటుంది ఆ దృశ్యం కుడా. మీలో ఎవరైనా అటు వెళ్లి నప్పుడు గమనించండి) 15 , 20 నెమళ్ళు ఒక్కసారి పురివిప్పి ఆడుతుంటే ఓహ్ దానిని మాటలలో వర్ణించలేము. అంత గొప్పగా అనిపించింది. మనసంత ఏదో తెలియని పులకిన్తతో పాటు తియ్యని బాధ అనిపించింది. అంత గొప్ప నెమళ్ళ నాట్యం చూసేందుకైనా అక్కడకు వెళ్ళాలి ఎవరైనా. అలాగే అక్కడ కోటలో ఊరికి సుమారు నాలుగు కి.మీ.లలో 'అర్వతు కంభాడ దేవస్తానం' అని ఒక గొప్ప దేవాలయం ఉన్నది. అది మేము చుసిన అన్ని దేవాలయాలలో మొదటి ఐదింటిలో ఒకటి అని చెప్పవచ్చు.  అంత గొప్పగా ఉంది. ప్రతి పిల్లర్ మీద, మండపం మీద గోడలమీద ఆణువణువూ శిల్పాలతో అందాలను నింపిన ఆ శిల్పులకు శాతానిక నమస్సులు. అలాగే అంతటి పనితనాన్ని భావితరాలకు అందించిన ఆనాటి రాజులకు కోటాను కోట్ల వందనములు. అంతకన్నా మనం చెయ్యగలిగింది కుడా ఇంకేమి లేదేమో. కాని ప్రతి ఒక్కరు వెళ్లి చూడదగిన దేవాలయాలు అవి.
                            మధురమైన అనుభూతిని మనసులో నింపుకొని 25kms దూరంలో ఉన్న 'హంగల్' అను వూరు చేరాము. అక్కడ 'తారకేశ్వర దేవాలయం' మహా అద్భుతమైన శిల్ప కళతో అలరిస్తుంది. అక్కడ కుడా నిత్య పూజాదికాలు జరుగుతున్నాయి. కొంత రిపేర్ వర్క్ చేస్తున్నారు. చాలా మంచిగా ఉంది అక్కడి నిర్మాణము. అది చూసుకొని అప్పటికే 7pm అయింది కనుక ఇక ఆ రోజుకి దర్శనాలు ఆపివేసి నైట్ హాల్ట్ 'హావేరి' లో చేద్దామని నిర్ణఇంచుకొని ఇంకో 40kms ప్రయాణం చేసి ఆ జిల్లా ముఖ్య పట్టణం చేరాము. బస్టాండ్ సెంటర్ లోనే ఒక హోటల్ లో రూమ్స్ తీసుకున్నాము. భోజనం చేయాలనిపించక జస్ట్ అల్పాహారం చేసాము. అదికూడా 'ధార్వాడ్ పేడా' తిని హాట్ కొంచం తిన్నాము. దూద్ పేడా అని మనవద్ద ఉంటుందే అదే అది. అయితే ధార్వాడ్ పేడా అంటే ధార్వాడ్ లో తయారైనది. అది చాలా ప్రసిద్ది చెందినది. మన దేశాధ్యక్షులు, ప్రైంమినిస్టర్స్ కుడా చాలా మంది ధార్వాడ్ పేడా ను ప్రత్యేకంగా తెప్పించుకొని తిన్నారని చెపుతారు. taste అంత గొప్పగా ఏమి అనిపించా లేదు కాని పరవాలేదు బాగానే ఉందనిపించింది. బస్టాండ్ మరీ చిన్నదిగా ఉంది. లైటింగ్ సరిగా లేదు. మన నరసరావుపేట బస్ స్టాండ్ దానికన్నా బాగుందనిపించింది. రూంకి చేరి  అలసి, సొలసి పోయినాము కనుక నిద్ర పోయాము. ఇక చివరి రోజు ప్రయాణ విశేషాలు వివరిస్తాను.  మా మూడవరోజు (చివరి రోజు) యాత్ర గురించి ఇప్పుడు వివరిస్తాను.

                        30th ఆగస్టు  హావేరి లో ఉదయమే నిద్ర లేచి స్నానాదికములు ముగించు కొని కాఫీ తీసుకొని ఆరోజుకి ముందుగా 'కాగినేల్'  ( kaginele ) బయలుదేరాము. అది మహా భక్తుడైన 'కనకదాస' జన్మస్తలి. అయన ఆ వూరిలొని కేశవ టెంపుల్ లో శ్రీకృష్ణుని సేవించి తరించిన మహా భక్తుడు. అయన గురించి చాలా గొప్పగా చదివాను నేను. అయన పుట్టుకకు హరిజనుడు,  అయినా మహా భక్తుడు అయినాడు. ఆయనకు విద్యలు నేర్వాలని పించి గురువు వద్దకు వెళ్లి నేర్పమని అడిగాడట. గురువు గారు కనకదాస భక్తితత్త్వం ఎరిగిన వారు,  కనుకదాసు కడజాతి వాడైనా విద్య నేర్పించేందుకు అంగీకరించి గురుకులంలో చేర్చుకున్నారు. కాని తోటి బ్రాహ్మణ విద్యార్ధులు అది సహించలేక కనకదాసను  అనేక విధాల ఇబ్బందులు పెడుతుండేవారు. ఒకసారి గురువు గారు అది గమనించి మిగిలిన విద్యార్ధులకు గుణపాటం చెప్పనేంచి, శిష్యుల నందరను దగ్గరకు పిలిచి 'శిష్యులారా  మీరు నేను చెప్పిన విద్య ఎంతనేరుచుకున్నారో తెలుసుకో గలందులకు  ఇప్పుడు మీకందరకూ చిన్న పరీక్ష పెడుతున్నాను''. అని అందరకు తల ఒకటి చొప్పున అరటిపండును ఇచ్చి ''మీరందరూ ఈ పండును ఎక్కడకు అయినా వెళ్లి ఎవరూ చూడకుండా తినిరండి'' అని చెప్పారు. ఆ పండు తీసుకున్న ఆ విద్యార్ధులందరూ తలా ఒక వైపు వెళ్ళారు. ఒకరు చెట్టు చాటున, ఒకరు గట్టు చాటున, ఇంకొకరు గడ్డి వామి చాటున, ఒకరు కుటీరం చాటున, ఒకరు దొడ్లో, ఇలా అందరూ వాళ్ళ పండ్లను ఎవరూ చూడకుండా తిని గురువుగారి వద్దకు five నిమిషాలలో తిరిగి వచ్చారు. కాని కనకదాసు పదిహేను నిమిషాలు గడిచినా రాలేదు. మిగిలిని శిష్యులు గెలిచేయడం మొదలు పెట్టారు. వాడికి కనీసం ఎవరూ చూడకుండా అరటిపండు తినటం కుడా రాదు, వాడు కుడా విద్యనేర్చు కునే వాడేనా గురువు గారు అని వ్యగ్యాస్త్రాలు వదలడం మొదలు పెట్టారు. చివరకు ఒక గంటకు పైగా గడిచిన తరువాత ఏడుస్తూ కనకదాసు గురువు గారి దగ్గరకు అరటి పండుతో వచ్చాడు. అది చూసి శిష్య బృందమంతా ఒకటే నవ్వులు. కాని గురువుగారు 'ఏమైంది కనకా ఎందుకు ఏడుస్తున్నావు? పండు తినలేదేమి? అని అడిగాడు. దానికి కనకదాసు గురువుగారి పాదాల మీద పడి నన్ను మన్నించండి గురుదేవా మీ ఆజ్ఞను పాటించలేక పోయాను. మీరేమో ఎవరూ చూడకుండా తినమన్నారు. సరే అని నేను పెద్ద చెట్టు చాటుకు వెళ్లి పండు తిందామని చుస్తే మీరు చెప్పినట్లు భగవంతుడు సర్వాంతర్యామి, అన్నిటియందు, అన్నిచోట్ల ఆయనే ఉన్నాడు కదా. కనుక అక్కడ భగవంతుడు నన్ను చూస్తూ ఉన్నాడు, గట్టు చాటుకు వెళ్ళిన, చివరికి చీకటి గదిలోకి వెళ్ళిన ప్రతీ చోటా ఆ భగవంతుడు నన్ను చూస్తూనే ఉన్నాడు గురుదేవా అందు వలన మీరు చెప్పినట్లు ఎవరు చూడకుండా నేను పండు తినలేక పోయాను నన్ను మన్నించండి గురుదేవా'' అని పాదాలు పట్టేసుకున్నాడు. అదివిని గురువు గారు పరమానంద భరితులై  కనకదాసను ఆలింగనం చేసుకొని, కనకా నిన్ను శిష్యునిగా పొంది నేను ధన్యుడ నయ్యాను రా అన్నారట. తోటి విద్యార్ధులు కుడా కనకదాస గొప్ప మానసిక స్తితికి మిగుల అబ్బురపడి, అతని గొప్పదనాన్ని అంగికరించి తనతో చెలిమి చేసారట అక్కడ నుండి.
                                                          అలాగే ఉడిపి కృష్ణుని గుడిలో కుడా కనకదాస గొప్పదనాన్ని తెలియజేసే ఒక సంఘటన జరిగింది. సారీ ఇప్పుడు దానిని వివరించలేను. సందర్భం వేరు కదా. (ఆసక్తి ఉన్నవారు విడిగా నన్ను అడగండి తెలియజేస్తాను). అలాంటి గొప్పవాడైన కనకదాస జన్మస్తలికి  వెళ్లి ఆశ్రమాన్ని దర్శించు కున్నాము, peetadhipati గారు వేరే వూరు వెళ్లినారని చెప్పారు. ఆశ్రమం చాలా బావుంది. పెద్ద వక్కల తోట ఉంది పక్కనే. చుట్టూ పూల చెట్లతో చాలా అద్భుతంగా ఉంది. అక్కడ మా నిత్య గాయత్రి అగ్నిహోత్రం చేసుకొని, అక్కడకు దగ్గరిలోనే ఉన్న కనకదాస సమాధి మందిరం వద్దకు వెళ్ళాము. కొత్తగా గుడి కట్టినట్లు ఉన్నారు. ఇంకా వర్క్ జరుగుతుంది. పక్కనే పెద్ద చెరువు. స్వామి దర్శనం చేసుకొని కనకదాస గొప్పదనాన్ని, అయన వారసుల గురించి అక్కడి పూజారిని అడిగి తెలుసుకొని, వూరిలో ఉన్న కేశవ స్వామి దేవాలయానికి వెళ్ళాము. అక్కడ స్వామి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. అందు వలన స్వామి విగ్రహాన్ని పక్కన కనకదాస మందిరంలో ఉంచారు. పక్కనే నరసింహ స్వామి మందిరం ఉంది. ఆ స్వామిని కుడా దర్శించుకొని అల్పాహారం ఆ గ్రామం లో తీసుకొని తిరిగి 'హావేరి' చేరాము.                      హావేరిలో  'హుక్కేరి మటం' చాలా ప్రసిద్ది చెందింది. ముందుగా అక్కడకు వెళ్లి పీటాధిపతి దర్శనం చేసుకొని, అక్కడ ఉన్న శివాలయాన్ని దర్శించుకున్నాము.  ఆ ఆశ్రమానికి ఎదురుగానే ఎంతో ప్రసిద్ది చెందిన 'సిద్దేశ్వర టెంపుల్' లోకి వెళ్ళాము. దేవాలయం చాలా విశాలంగా ఉన్నది. చుట్టూ పచ్చని పార్క్ విస్తరించి ఉంది. సుమారు పది యకరముల స్థలములో విస్తరించి ఉంది పార్క్. దేవాలయం కుడా చాలా పెద్దగా ఉంది. చాళుక్యుల పనితనం ప్రతి అంగుళం లోను ప్రతిఫలిస్తుంది ఉంది. నాజూకైన పనితనం తో కడు సుందరంగా, మనోహరంగా ఉన్న దేవాలయాన్ని సందర్శించు కున్నాము. పూజలు లేవు. కేవలము శిల్పకళా నైపుణ్యాన్ని దర్శించు కొని 'హావేరి' నుండి బయలు దేరి నేరుగా గదగ్ కు 25kms లో ఉన్న 'అన్నిగేరి' అను వూరు వెళ్ళాము. అది హావేరికి సుమారు 95kms ఉంది. అక్కడ అమృతేశ్వర టెంపుల్ చాలా గొప్పగా ఉంది. అయితే అక్కడ కుడా పూజాది క్రతువులు ఏమి లేవు, కాని శిల్ప సౌందర్యం చాలా గొప్పగా ఉంది దానిని దర్శించు కొని, గదగ్ చేరి అక్కడకు 12kms లో ఉన్న 'లక్కుండి' చేరాము.
                      భోజన సమయం ఐనదని లక్కున్డిలో చేసాము. చాలా బావుంది.  అక్కడ సుమారు  వందకు పైగా దేవాలయాలు ఉన్నాయట. అక్కడ మ్యుజియం కూడా ఉన్నది. ముందుగా మ్యుజియం చూసుకొని పక్కనే ఉన్న 'బ్రహ్మ జైనాలయం' అక్కడి శిల్ప కళా వైభవం అద్భుతం, అక్కడ బ్రహ్మ, తీర్థంకరుల విగ్రహాలు కడుసుందరంగా ఉన్నాయి. వాటి సౌందర్యాన్ని వర్ణించటం అమ్మో నా వలన కాదులే.  వాటిని దర్శించుకొని, ఒక చిన్న కుర్రాడిని హెల్ప్ కోసం కార్ లో ఎక్కించుకొని మిగిలిన దేవాలయాలు చూసేందుకు వెళ్ళాము. బసవన్న, మల్లికార్జున, neelakanta , నన్నేస్వర, సూర్యనారాయణ, కాశి విశ్వేశ్వర ఇలా అనేక దేవాలయాలను దర్శించు కున్నాము. ముఖ్యంగా  కాశివిశ్వేశ్వర ఆలయంలో  ఒక దర్వాజా ఐదు స్తంభాలను ఏక శిలలో, ఇంకొక దర్వాజా ఏడు స్తంభాలను ఏక శిలలో, మరొక దర్వాజా తొమ్మిది స్తంభాలను ఏక శిలలోనే అతి నాజూకైన, అతి సన్నని చేక్కుబడితో నిర్మించిన విధము అబ్బురాన్ని, మనోల్లాసాన్ని కలిగించింది. అయితే బాగా శిధిల స్తితిలో ఉన్నట్లున్నాయి. అర్చిలాజికాల్ వారు ఈ మధ్యనే తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. విధిగా చూడదగిన  దేవాలయాల సముదాయం ఇక్కడ ఉంది.  
  
                                   అక్కడ నుండి 12kms లలో ఉన్న 'గదగ్' తిరిగి వెళ్ళాము. ఇక్కడి దేవాలయాలు 4pm to 8pm  మాత్రమే సాయత్రం తెరిచి ఉంటాయన్నరనే, ముందుగా లక్కుండి వెళ్లి గదగ్ వచ్చాము.    గదగ్ లో ముఖ్యంగా దర్శిన్చుకోవలసినది త్రికూటేశ్వర టెంపుల్, సరస్వతి టెంపుల్, వీరనారాయణ టెంపుల్  ఈ మూడు కుడా చాలా అద్భుత సౌందర్యంతో విల శిలలు తున్నాయి. అయితే వీరనారాయణ టెంపుల్ అంత కూడా పాత గుడికి సిమెంట్ తో వర్క్ చేసి కొంత నాగరిక హంగులు తీసుకు వచ్చి ఆనాటి అందాలు కనపడ కుండా చేసారు. మిగిలిన రెండు దేవాలయాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఒక్క సరస్వతి టెంపుల్ లో తప్ప మిగిలిన రెండు దేవాలయాలలో కుడా పూజాదికాలు శ్రద్ధతో చేస్తున్నాను. త్రికూటేశ్వర టెంపుల్ చాలా గొప్పగా ఉంది. పెద్దగా కుడా ఉంది. అలాగే సరస్వతి టెంపుల్ కుడా శిల్పకళా నైపుణ్యంతో చాలా బాగుంది. ముఖ్యంగా ఆ స్తంబలపైన చెక్కిన నగిషీలు చూడ మనోహరంగా ఉన్నాయి. సరస్వతి టెంపుల్ లో పూజాదికాలు జరగటం లేదు అని పక్కనే 'సరస్వతి, గాయత్రీ, సావిత్రి' ముగ్గురమ్మల దేవాలయం ఒకటి నిర్మించి శంకరాచార్య ఆచారం లో నడుపుతున్నారు. బాగుంది. సరస్వతి టెంపుల్ బ్యాక్ సైడ్ అష్టభుజ వినాయక టెంపుల్ ఉంది. దర్శనీయము.  వాటిని దర్శించు కొని గదగ్ రైల్వే స్టేషన్ చేరాము. అక్కడ ఫౌర్ అవర్స్ టైం ఉంది. కార్ వాడిని పంపించాము. వాడికి ముందుగా అనుకున్నట్లు మూడు రోజులకు total 900kms కి అమౌంట్ ఇచ్చాము. అయితే మేము జర్నీ చేసింది మాత్రం 840kms  మాత్రమె. డ్రైవర్ కు extraa 300 రుపీస్ ఇచ్చాము. ఆతను బాగా సహకరించాడు, కనుకనే అంత బాగా మేము టూర్ ని ఎంజాయ్ చేయ గలిగాము. ఆ రాత్రికి బయలుదేరి 31st  సాయంత్రానికి ఇంటికి చేరాము. 
                               
                                       కల్యాణి చాళుక్యులు ఆనాడు ఎంత గొప్పగా పరిపాలన చేసారో తెలియదు కాని, వారి కళా వైభవం మాత్రం అమోఘము. భారతీయ కళాసంపదను ఆస్వాదించా లనుకునే ప్రతి ఒక్కరు దర్శించ దగిన అత్యున్నత సంపద అక్కడ ఉన్నది. వీలైన వాళ్ళు వెళ్లి దర్శించు కొని రండి. ఇంకా మీకెవరికైనా doubts ఏమైనా ఉంటె కాల్ చెయ్యండి.  ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ జర్నీ ని ముగిస్తున్నాను. కొంచం విపులంగా వ్రాసి విసిగించానేమో. సారీ ఫర్ ది ట్రబుల్.  ఏ ఒక్కరికైనా నాఈ బ్లాగ్ లోని విషయం ఉపయోపడితే నేను పడిన  శ్రమకు ఫలితం దక్కినట్లే అని తలుస్తాను. మరలా ఇంకో టూర్ విశేషాలతో త్వరలోనే కలుద్దాం. మీ విజయ భాస్కర్

                                 

4 comments:

  1. good job sir. it is useful to us and a worthy contribution from your side

    ReplyDelete
  2. Chaala Baagaa, Kallaku Kattinattu gaa raasaaru Sir, Photos anni flicker lanti dhantlo petti link share cheysi unte inkaa bauntundheymo ani manavi

    ReplyDelete
  3. అద్భుతమైన విషయం

    ReplyDelete